God's Service | Food Distribution to poor people | CBT KOSIGI



*ఘనత కొరకు కాదు..*
*బాధ్యత నెరవేర్చుటకు..!*

ఉండరా.. ఇంటనే ఉండరా..
బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చురా.. అని పౌరులకు ప్రభుత్వాలు విన్నవిస్తూ, వారికి కావలసిన పదార్థాలు చేకూరుస్తూ ఉంటున్న ఈ విపత్కర పరిస్థితుల్లో… అసలు ప్రభుత్వం నుండి ఏ భరోసా లేని అభాగ్యుల పరిస్థితేమిటి?
ఉండరా.. ఇంటనే ఉండరా.. అంటే అసలు నాకు ఇల్లే లేదనే పరిస్థితి వారిది, బతికుండడానికి బలిసాకు తినాలన్నా కదలలేని పరిస్థితి వారిది మరి వారు బ్రదికేదెలా? అన్న ఆలోచనకు సమాధానమే ఈ ప్రభుత్వాలను నియమించిన విశ్వకిరీటధారుని నియమం
*నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము.!*
ఈ మాటలను తన పిల్లలైన అనేకులలో నూరిపోసి *ప్రభుత్వాలు చేయలేని సహాయం పరమతండ్రి చేస్తున్నాడని* ప్రతి అభాగ్యునికి అండగా నిలిచే కార్యక్రమాన్ని *దైవజనులు: శ్రీ. పి.డి. సుందరరావు గారు* చేపట్టారని తెలియజేయుటలో ఆయన ఆత్మీయ పిల్లలుగా ఎంతగానో అతిశయిస్తున్నాం. ఇంతకాలం ఆయన మనకు నేర్పించిన వాక్యం ద్వారా వెలిగాం, ఇప్పుడు ఆ వాక్యం చెప్పిన క్రియలతో వెలుగుతున్నాం.
*మత్తయి 5: 16*
*మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.*

ఈ విధంగా మనలోని వాక్యపు వెలుగును అనేకులకు ప్రకాశింప జేసే పనిలో భాగంగా CBT KOSIGI ఆధ్వర్యంలో కోసిగి, ఉరుకుంద పరిసర ప్రాంతాల్లో అభాగ్యులకు ఆహారాన్ని అందిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాతో పాలివారగుటకు మమ్మును సంప్రదించగలరు.
*ఇది ఘనత కొరకు కాదు..*
*బాధ్యత నెరవేర్చుటకు*
9966390623
6304772123

source

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *